: అగస్టా కుంభకోణంపై రాజ్యసభలో రగడ.. పోడియంలోకి దూసుకెళ్లిన కాంగ్రెస్ ఎంపీలు.. వాయిదాల పర్వం
అగస్టా వెస్ట్ లాండ్ కుంభకోణంపై రాజ్యసభలో రగడ కొనసాగుతోంది. ఈ అంశంపై టీఎంసీ చర్చకు నోటిసులిచ్చింది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకున్నారు. అగస్టా వెస్ట్ లాండ్ కుంభకోణంపై సభలో రక్షణ మంత్రి ఓ ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు స్పీకర్ పోడియంలోకి దూసుకెళ్లారు. కాంగ్రెస్ సభ్యుల ఆందోళనలతో స్పీకర్ రాజ్యసభను పదినిమిషాలు వాయిదా వేశారు. అనంతరం 11.30 గంటలకు సభ మళ్లీ ప్రారంభమైంది. రాజ్యసభలో ప్రతిపక్షాలు ఏ మాత్రం తగ్గకపోవడంతో స్పీకర్ మరోసారి సభను వాయిదా వేశారు.