: యోగా న‌న్ను కాపాడింది: జ‌గ‌ప‌తిబాబు


యోగా త‌న‌ను కాపాడింద‌ని, ప్ర‌తీరోజు యోగా చేయ‌డం వ‌ల్ల ఆరోగ్యంగా ఉండొచ్చ‌ని టాలీవుడ్ న‌టుడు జ‌గ‌ప‌తి బాబు అంటున్నారు. ‘అంద‌రికీ యోగా’ పేరిట హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న మాట్లాడారు. మాన‌సిక ప్ర‌శాంత‌త‌కు యోగా సాధ‌నే చ‌క్క‌ని మార్గం అన్నారు. వ్యాధుల బారి నుంచి త‌ప్పించుకోవ‌డానికి యోగా చేయాల‌ని సూచించారు. గ‌తంలో ఆయ‌న యోగా ద్వారా ఉప‌శ‌మ‌నం పొందిన సంద‌ర్భాన్ని గుర్తుచేసుకున్నారు. ఓ సినిమా షూటింగ్‌లో ప్ర‌మాదం కొనితెచ్చుకున్న తాను, ఊపిరి తీసుకోలేని స్థితిలో వుంటే, యోగాలోని ప్రాణాయామ ప‌ద్ధ‌తిని సాధ‌న చేసి ఉప‌శ‌మ‌నం పొందినట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News