: సేవతో డీజీపీ మనసు గెలిచిన గురుదేవ ట్రస్టు... లక్ష విరాళమందించిన జేవీ రాముడు
ఏపీలోని విజయనగరం జిల్లా కొత్తవలస కేంద్రంగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో నిమగ్నమైన గురుదేవ చారిటబుల్ ట్రస్టు... అక్కడి జనాలనే కాకుండా ఏపీ పోలీసు శాఖ చీఫ్ డీజీపీ జేవీ రాముడి మనసునూ గెలిచింది. నిన్న సతీసమేతంగా కొత్తవలస వెళ్లిన రాముడు... ఆ సంస్థ పనితీరుకు ముగ్ధుడయ్యారు. అక్కడికక్కడే లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించారు. వికలాంగులకు కృత్రిమ అవయవాలను తయారు చేస్తున్న గురుదేవ ట్రస్టు... ఈ రంగంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా సత్తా చాటుతున్న జైపూర్ తో పోటీ పడుతోంది. గురుదేవ ట్రస్తు నిర్వహిస్తున్న కృత్రిమ అవయవాల తయారీని స్వయంగా పరిశీలించిన రాముడు... ఈ కేంద్రానికి మరింత గుర్తింపు రావాల్సిన అవసరముందని అభిప్రాపడ్డారు. భవిష్యత్తులో జైపూర్ కృత్రిమ అవయవాలకు వచ్చినంతకంటే మెరుగైన గుర్తింపు గురుదేవ ట్రస్టు అవయవాలకు రావాలని ఆయన ఆకాంక్షించారు.