: అదరగొట్టిన పూణే టాపార్డర్...ఫీల్డింగ్ లో ఆకట్టుకున్న ముంబై
ముంబైలోని వాంఖడే వేదికగా జరుగుతున్న 29వ ఐపీఎల్ సీజన్ 9 మ్యాచ్ లో టాస్ ఓడిన రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్ అజింక్యా రహనే (4) ఆరంభంలోనే పెవిలియన్ చేరాడు. అనంతరం మరో ఓపెనర్ సౌరభ్ తివారీ (40)కి జత కలిసిన స్టీవ్ స్మిత్ (45) దూకుడుగా ఆడాడు. వీరిద్దరి దూకుడుకు పది ఓవర్లు ముగిసే సరికి పూణే జట్టు రెండు వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. పూణే బ్యాట్స్ మన్ కొట్టిన భారీ షాట్లను ముంబై అటగాళ్లు అద్భుతంగా అడ్డుకున్నారు. లేని పక్షంలో పూణే ఖాతాలో మరిన్ని పరుగులు చేరేవే. కాగా, సౌరభ్ తివారీకి జతగా హేండ్స్ కోంబ్ (5) ఆడుతున్నాడు. ముంబై బౌలర్లలో మెక్ క్లెంగన్, బుమ్రా చెరో వికెట్ తీశారు.