: ప్రత్యేకహోదాకు మోదీ నిరాకరిస్తే ప్రత్యక్ష కార్యాచరణ ప్రారంభిస్తాం: ప్రత్తిపాటి
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా కోసం పోరాడుతామని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. గుంటూరులోని బృందావన్ గార్డెన్ లో ఇంకుడు గుంతల కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రంలో మిత్రపక్షం అధికారంలో ఉన్నంత మాత్రాన తాము చేతులు ముడుచుకుని కూర్చోమని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇచ్చేందుకు ప్రధాని మోదీ నిరాకరిస్తే ప్రత్యక్ష కార్యాచరణ ప్రారంభిస్తామని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర విభజన సందర్భంగా పార్లమెంటు సాక్షిగా ప్రత్యేకహోదాతో పాటు చాలా హామీలు ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. పొరుగు రాష్ట్రాలతో సమానంగా ఎదగాలంటే రాష్ట్రానికి హోదా చాలా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.