: కంగన పోలీసులకు ఏం చెప్పింది?
బాలీవుడ్ నటులు హృతిక్ రోషన్, కంగనా రనౌత్ వివాదం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. కంగనా రనౌత్ తరపు న్యాయవాది రిజ్వాన్ సిద్ధిఖీ మాట్లాడుతూ, కంగనా తన సోదరి రంగోలితో కలిసి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారని అన్నారు. ఈ సందర్భంగా తన అకౌంట్ ను హృతిక్ హ్యాక్ చేశాడని కంగనా పోలీసులకు తెలిపిందని ఆయన చెప్పారు. ఎఫ్ఐఆర్ నమోదు సందర్భంగా హృతిక్ చెప్పని పలు విషయాలను కంగనా పోలీసులకు తెలిపిందని ఆయన అన్నారు. దీంతో పోలీసులకు తెలియని పలు అంశాలను కంగనా తేటతెల్లం చేసిందని ఆయన చెప్పారు. తాజాగా కంగనా ఇచ్చిన వాంగ్మూలంతో ఆమె రెండుసార్లు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్టైందని ఆయన అన్నారు. గతంలో కంగనా ఇంటికి వెళ్లి ఆమె వివరణ తీసుకున్న పోలీసులు, తాజాగా ఆమె స్టేషన్ కు రావడంతో వాంగ్మూలం నమోదు చేశారని ఆయన తెలిపారు. దీంతో ఈ వివాదం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు.