: ఐదు కోట్ల మంది పేదలకు ఉచిత వంట గ్యాస్... 'ఉజ్వల యోజన'ను ప్రారంభించిన మోదీ


దేశంలోని 5 కోట్ల పేద కుటుంబాలకు మేలు చేకూర్చేలా ప్రధాని నరేంద్ర మోదీ మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు. ఉత్తరప్రదేశ్‌ లోని బాలియాలో కొద్దిసేపటి క్రితం 'ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం’ను ఆయన ప్రారంభించారు. దీని ద్వారా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కోట్లాది పేద కుటుంబాలకు ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్లు అందించనున్నట్టు ఈ సందర్భంగా మోదీ తెలిపారు. పలువురు మహిళలకు స్వయంగా గ్యాస్‌ కనెక్షన్లు పంపిణీ చేసిన మోదీ, పేదలందరి జీవితాల్లో వెలుగులను నింపే లక్ష్యంతో తమ ప్రభుత్వం మరిన్ని పథకాలను ప్రకటించనుందని వివరించారు. గ్రామాల అభివృద్ధితోనే దేశం ముందడుగు వేస్తుందని తాను నమ్ముతానని అన్నారు.

  • Loading...

More Telugu News