: విశాఖలో ఉండి లాఠీ చార్జ్ చేయించారు: చంద్రబాబుపై జగన్ నిప్పులు


తమ వేతనాలను పెంచాలని నిరసనలు తెలుపుతున్న బ్రాండిక్స్ కార్మికులపై చంద్రబాబునాయుడు దగ్గరుండి లాఠీ చార్జ్ చేయించారని వైకాపా అధినేత వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. ఈ ఉదయం లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో జరిగిన మేడే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం ప్రసంగిస్తూ, సీఎం తీరు ఆక్షేపణీయమని, కార్మికులు తమ సమస్యలు చెప్పుకునేందుకు ఇంక ఎవరి దగ్గరకు వెళ్లాలని ప్రశ్నించారు. తమ పార్టీ పేరులోని 'ఎస్' అంటే 'శ్రామికులు' అని గుర్తు చేసిన జగన్, కార్మికుల సమస్యల పరిష్కారానికి తామెల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. రైతులకు, యువతకు పార్టీ అండగా నిలుస్తుందని చెప్పారు.

  • Loading...

More Telugu News