: చల్లగా ఉండే కేరళ తొలిసారి మండుతోంది: ఐఎండి
చుట్టూ తేమతో కూడిన భూమి, నీరు, చల్లటి వాతావరణం ఉండే కేరళ వేడెక్కింది. కేరళ చరిత్రలో తొలిసారిగా వేడి గాలులు చుట్టుముట్టాయని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మరో రెండు రోజులు, ముఖ్యంగా పాలక్కాడ్, కోజికోడ్ ప్రాంతాల్లో హీట్ వేవ్ కొనసాగుతుందని, ప్రజలు 11 నుంచి 3 గంటల మధ్య బయటకు రావద్దని తిరువనంతపురం ఐఎండీ డైరెక్టర్ కే సంతోష్ హెచ్చరికలు జారీ చేశారు. రికార్డు స్థాయిలో 40 డిగ్రీలకు మించిన వేడిమి నమోదు కానుందని తెలిపారు. ప్రస్తుతం పలు ప్రాంతాల్లో 37 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతోందని, ఇది మరింతగా పెరగనుందని తెలిపారు.