: 'బెగ్గర్ సింగ్'వి కావద్దు: పవన్ కల్యాణ్ పై వర్మ సెటైర్; వీడియో చూడండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సంపాదించే విషయంలో కేంద్రాన్ని అడుక్కోవడం మానాలని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై దర్శకుడు రాంగోపాల్ వర్మ ఓ సెటైర్ వేశాడు. 'బెగ్గర్ సింగ్ కాదు, గబ్బర్ సింగ్ కావాలి' అంటూ, తన ట్విట్టర్ ఖాతాలో డైరెక్ట్ అటాక్ కు దిగాడు. అసెంబ్లీ ఎన్నికల్లో, తన ప్రచారాన్ని నమ్మి ఓట్లు వేసిన కాపులను పవన్ మోసం చేశాడని తీవ్ర ఆరోపణలు చేశాడు. పవన్ కల్యాణ్ అభిమానులు సైతం ఆయన వైఖరిని తట్టుకోలేకపోతున్నారని ఆరోపించారు. పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ కన్నా, అల్లు అర్జున్ సరైనోడు చిత్రం పెద్ద విజయం సాధించిందని దెప్పి పొడిచాడు కూడా.