: 4న 'అగస్టా' బండారం బట్టబయలు, పార్లమెంట్ ముందుకు పత్రాలు: పారికర్


యూపీఏ హయాంలో జరిగిన 'అగస్టా వెస్ట్ ల్యాండ్' చాపర్ల కొనుగోలు డీల్ వెనకున్న వివరాలన్నీ పార్లమెంట్ ముందు ఉంచనున్నట్టు రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ వెల్లడించారు. 4వ తేదీన పూర్తి వివరాలతో కూడిన దస్త్రాలన్నింటినీ పార్లమెంట్ లో ప్రవేశపెడతానని, దాంతో ఎవరి తప్పెంతన్నది తేలుతుందని ఆయన అన్నారు. కాగా, ఈ డీల్ లో కాంగ్రెస్ లోని పలువురు సీనియర్ నేతలకు ముడుపులు అందాయన్న ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. తామందించే హెలికాప్టర్లను కొనుగోలు చేయాలన్న ముందస్తు ఒప్పందం చేసుకున్న ఇటలీ సంస్థ, డీల్ కుదిరేందుకు సహకరించాలని కోరుతూ పలువురికి కోట్లాది రూపాయలను ముడుపులుగా అందించిందని, వాటిని కాంగ్రెస్ మంత్రులు, పెద్దలు అందుకున్నారని బీజేపీ విమర్శిస్తుండగా, వాటిని కాంగ్రెస్ ఖండిస్తోంది. కాంగ్రెస్ ను ఇరుకున పెట్టేందుకు మరోసారి అగస్టా కుంభకోణాన్ని బీజేపీ వెలుగులోకి తీసుకురాగా, పూర్తి విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.

  • Loading...

More Telugu News