: ఏమాత్రం ఉపయోగం లేని పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్: జ్యోతుల నెహ్రూ


జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ప్రజలకు ఎంతమాత్రమూ ఉపయోగం లేదని ఆ పార్టీ నుంచి ఇటీవల తెలుగుదేశంలోకి ఫిరాయించిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విమర్శించారు. ఈ ఉదయం తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకున్న ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడారు. జగన్ కు రాజకీయ అనుభవం లేదని ఆరోపించిన ఆయన, నాయకత్వ లోపం కారణంగానే ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడుతున్నారని అన్నారు. వైకాపా కనీసం ప్రతిపక్ష పాత్రను పోషించడంలో సైతం విఫలమవుతోందని అన్నారు. ఇక జగన్ మారడని భావించిన మీదటే, పార్టీని మారినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News