: పెరిగిన తరువాత హైదరాబాద్, విశాఖలో పెట్రోలు ధర ఇది!


నిన్న రాత్రి పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచుతూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయించిన సంగతి తెలిసిందే. పెట్రోలుపై రూ. 1.06, డీజిల్ పై రూ. 2.94 పెంచుతున్నట్టు ఓఎంసీలు తెలుపగా, హైదరాబాద్ లో తాజా ధరలు ఇలా ఉన్నాయి. ఇండియన్ ఆయిల్ పెట్రోలు బంకుల్లో ధర రూ. 65.16 నుంచి రూ. 66.29కి పెరుగగా, హిందుస్థాన్ పెట్రోలియం బంకుల్లో లీటరు పెట్రోలు ధర రూ. 65.18 నుంచి రూ. 66.24కు పెరిగింది. ఇదే సమయంలో డీజిల్ ధర రూ. 51.73 నుంచి రూ. 54.89కి (ఇండియన్ ఆయిల్), రూ. 51.79 నుంచి రూ. 54.95కు (హెచ్ పీ) చేరుకుంది. ఇక వైజాగ్ లో పెట్రోలు ధర రూ. 66.48 నుంచి రూ. 67.54కు, డీజిల్ ధర రూ. 53.08 నుంచి రూ. 56.02కు (హెచ్ పీ బంకుల్లో) చేరింది.

  • Loading...

More Telugu News