: మోదీతో పాటే చదువుకున్న ఆనందీ బెన్ పటేల్... విద్యార్హతలు బయటపెట్టిన గుజరాతీ పత్రిక!


ప్రధాని నరేంద్ర మోదీ ఎంతవరకూ చదువుకున్నారు? ఆయన విద్యార్హతలేంటి? ఈ ప్రశ్నలకు సమాధానాన్ని దేశ ప్రజలకు చెప్పేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సహ చట్టాన్ని వినియోగించుకుంటూ దరఖాస్తు చేసిన వేళ, గుజరాత్ కు చెందిన 'అహ్మదాబాద్ మిర్రర్' పత్రిక మోదీ విద్యార్హతల వివరాలను బయటపెట్టింది. ఆయన విస్నగర్ లోని ఎంఎన్ సైన్స్ కాలేజీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివారని, ఫస్ట్ క్లాస్ లో పాసయ్యారని తెలిపింది. 1983లో 62.3 శాతం మార్కులతో పట్టాను పొందారని వివరించింది. ఆయన చదువుకుంటున్న సమయంలోనే ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్, ఇనార్గానిక్ కెమిస్ట్రీ విభాగంలో ఎంఎస్సీ చేస్తున్నారని, వీరిద్దరి రోల్ నెంబర్ 71 అని పేర్కొంది. కాగా, గతంలో పలువురు ఇవే వివరాల కోసం దరఖాస్తులు చేయగా, గుజరాత్, ఢిల్లీ యూనివర్శిటీలు నిరాకరించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News