: ప్రజాభిప్రాయం... కేంద్ర మంత్రుల్లో చివరి స్థానంలో బండారు దత్తాత్రేయ!


సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ తాజాగా వెలువరించిన సర్వే ప్రకారం, కేంద్ర మంత్రుల్లో అత్యంత అసంతృప్త పనితీరును చూపుతున్న మంత్రిగా కార్మిక, ఉపాధి కల్పనా శాఖా మంత్రి బండారు దత్తాత్రేయ నిలిచారు. ఆయనకన్నా ముందు రాంవిలాస్ పాశ్వాన్ ఉన్నారు. ఇక మోదీ క్యాబినెట్ లోని మంత్రుల్లో సుష్మాస్వరాజ్ ఉత్తమ మంత్రిగా తొలి స్థానంలో నిలువగా, ఆపై రాజ్ నాథ్ సింగ్, సురేష్ ప్రభు, మనోహర్ పారికర్, జైట్లీలకు చోటు దక్కింది. ఉత్తమ ఫలితాలు నమోదు చేసిన శాఖగా రైల్వే శాఖకు, ప్రభావం చూపని శాఖలుగా కార్మిక, ఉపాధి కల్పన న్యాయ, గ్రామీణాభివృద్ధి శాఖలను ప్రజలు ఎంచుకున్నారు. వెంకయ్యనాయుడు, స్మృతీ ఇరానీలకు సగటు మంత్రులుగా స్థానం లభించింది. ఇక ఇదే సర్వేలో నల్లధనాన్ని తీసుకురావడంలో కేంద్రం విఫలమైందని 29 శాతం మంది పేర్కొనగా, 'జన్ ధన్ యోజన' కేంద్రం సాధించిన మంచి విజయంగా 36 శాతం మంది, స్వచ్ఛ భారత్ మంచి కార్యక్రమమని 32 శాతం మంది మాత్రమే పేర్కొనడం గమనార్హం. విదేశాల నుంచి ప్రత్యక్ష పెట్టుబడులను తేవడంలో మోదీ కృషి అభినందనీయమని 23 శాతం మంది పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News