: మరో 'పెట్రో' బాంబ్... పెరిగిన ధరలు!
అంతర్జాతీయ ముడి చమురు మార్కెట్లో మారిన ధరలకు అనుగుణంగా దేశంలో పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగాయి. లీటరు పెట్రోలుపై రూ. 1.06, డీజిల్ పై రూ. 2.94 పెంచుతున్నట్టు ఓఎంసీ (ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్) లు వెల్లడించాయి. పెంచిన ధరలు తక్షణం అమల్లోకి వస్తాయని శనివారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపాయి. కాగా, పెరిగిన ధరల అనంతరం ఢిల్లీలో పెట్రోలు ధర రూ. 61.13 నుంచి రూ. 62.19కి, డీజిల్ రూ. 48.01 నుంచి రూ. 50.95కు పెరగనుంది. కాగా, రెండు వారాలక్రితం ఏప్రిల్ 16న పెట్రో ధరలను స్వల్పంగా తగ్గించిన సంగతి తెలిసిందే.