: సీఎం పాల్గొన్న కార్యక్రమానికి హాజరుకాని ‘విశాఖ’నగర ఎమ్మెల్యేలు!
విశాఖపట్టణం నగర ఎమ్మెల్యేలు అలక పూనారు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్న ఒక కార్యక్రమాన్ని వారు బహిష్కరించారు. విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ నూతన భవనాన్ని ఈ రోజు ముఖ్యమంత్రి ప్రారంభించారు. పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కానీ, విశాఖ నగర ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు మాత్రం హాజరుకాలేదు. ఈ విషయమై వారు మాట్లాడుతూ, నగర పోలీస్ కమిషనర్ తమకు తగిన గౌరవం ఇవ్వనందుకే తాము ఈ కార్యక్రమాన్ని బహిష్కరించామని సదరు ఎమ్మెల్యేలు ఆరోపించారు. కాగా, నగర సీపీ తమకు గౌరవం ఇవ్వడం లేదంటూ ఎమ్మెల్యేలు ఆరోపించడం కొత్తేమీ కాదు. గతంలో కూడా ఈ విషయమై వారు పలుసార్లు ఆరోపించారు.