: రెండేళ్లలో 4వేల మందిని ఉరితీసిన ఐఎస్ఐఎస్


వికృత చేష్ట‌లు, భయాన‌క దాడుల‌తో ప్ర‌పంచాన్ని ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోన్న ఐఎస్ఐఎస్ రెండేళ్ల వ్య‌వ‌ధిలో 4వేల మందికి పైగా ఉరిశిక్ష విధించింద‌ని యూకేలోని ఓ మాన‌వ హ‌క్కుల సంస్థ పేర్కొంది. దీనిపై యునైటెడ్ నేష‌న్స్ ఆర్గ‌నైజేష‌న్ స్పందించాల‌ని కోరింది. ఐఎస్ఐఎస్ ఉరితీత చ‌ర్య‌ను తీవ్ర‌మైన నేరంగా ప‌రిగ‌ణిస్తూ వీటిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరింది. గూఢ‌చ‌ర్యం చేస్తున్నార‌నే అనుమానంతో త‌మ సొంత కుటుంబస‌భ్యుల‌ను కూడా ఉగ్ర‌వాదులు హ‌త‌మారుస్తున్నార‌ని తెలిపింది. చిన్నారులు, మహిళ‌లు అని కూడా చూడ‌కుండా ఉరితీత‌కు పాల్ప‌డుతున్నార‌ని పేర్కొంది. ఐఎస్ఐఎస్ ఉరితీసిన వారిలో 2,230 మంది సున్నీలు, కుర్దిష్ సిటిజన్లు ఉన్నార‌ని తెలిపింది. ఉరితీత, భ‌యాన‌క కాల్పుల‌తో రెచ్చిపోతున్న ఐఎస్ఐఎస్ పై చ‌ర్య‌ల‌కు దిగాల‌ని యునైటెడ్ నేష‌న్స్ ఆర్గ‌నైజేష‌న్ ని మాన‌వ హ‌క్కుల సంస్థ కోరింది.

  • Loading...

More Telugu News