: ఎండల ప్రభావం... చనిపోయిన చేపల ఖరీదు రూ.కోటి !


మండే ఎండల ప్రభావం చెరువులపై పడటంతో నీరు వేడెక్కడం లేదా అవి ఎండిపోతుండటంతో చేపలు చనిపోతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. ఏలూరు రూరల్ శ్రీపర్రులో వందల ఎకరాల్లో చేపలు చనిపోయాయి. చనిపోయిన చేపల విలువ సుమారు రూ.కోటి వరకు ఉండవచ్చని తెలుస్తోంది. జిల్లా అంతటా ఇవే పరిస్థితులు ఉన్నాయి. చనిపోయిన చేపలను సమీప గ్రామాల ప్రజలు సంచుల్లో తీసుకువెళ్తున్నారు. రోజురోజుకీ ఎండ తీవ్రతలు పెరిగిపోతుండటంతో పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదని చేపల చెరువుల యజమానులు వాపోతున్నారు. ఇప్పుడే ఈవిధంగా ఉంటే రోహిణీ కార్తె సమయంలో పరిస్థితులు ఇంకేవిధంగా ఉంటాయోనని వారు ఆందోళన చెందుతున్నారు.

  • Loading...

More Telugu News