: విభజన త‌రువాత‌ రాష్ట్రంలో ఎన్నోమార్పులు సంభవించాయి: తమిళనాడు గవర్నర్ రోశయ్య


చాలా కాలం త‌రువాత‌ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప‌రిస్థితుల‌పై త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి కొణిజేటి రోశయ్య పెద‌వి విప్పారు. ఈ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో రోశ‌య్య‌ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర‌ విభజన త‌రువాత ఏపీలో ఎన్నో మార్పులు వ‌చ్చాయ‌న్నారు. రాష్ట్ర ప‌రిస్థితులు త్వ‌ర‌లోనే స‌ర్దుకుంటాయ‌ని, కొత్త సంసారం పెట్టినప్పుడు మ‌నిషి చేసుకునే ఏర్పాట్ల‌లా ప్ర‌స్తుతం ఏపీలో ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని వ్యాఖ్యానించారు. అన్ని పనులు క్రమంగా పూర్తవుతాయని వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాలు మ‌రింత‌ అభివృద్ధి చెందుతాయ‌న్న ఆశాభావం వ్య‌క్తం చేశారు. కోస్తా ప్రాంత వాసులనుద్దేశించి రోశ‌య్య మాట్లాడుతూ.. అక్క‌డి వారికి రాజకీయాల‌పై అవ‌గాహ‌న ఎక్కువేన‌ని కితాబిచ్చారు. అందుకే, కోస్తా ప్రజలను త‌మ‌వైపుకు తిప్పుకోవ‌డానికి రాజ‌కీయ‌పార్టీలు ప్ర‌య‌త్నిస్తున్నాయ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

  • Loading...

More Telugu News