: సౌకర్యం మాటునే వీర బాదుడు!... రైల్వే రిజర్వేషన్ రద్దు చార్జీలు డబుల్!
బయటకు కనిపించేదేమో... వెసులుబాటు. కష్టం లేని సౌకర్యం. ఇంటి ముంగిట్లోకే అన్నీ. దాని వెనుకే వీర బాదుడు. నొప్పి లేకుండా జేబును గుల్ల చేసే నయా దోపిడీ మంత్రం. ఇదీ ఇటీవలి కాలంలో భారతీయ రైల్వే అనుసరిస్తున్న కొంగొత్త వైఖరి. రైలు టికెట్ల రద్దు కోసం రిజర్వేషన్ కౌంటర్ల వద్దకు వెళ్లకుండా ఒక్క ఫోన్ కాల్ తో సదరు పనిని ముగించేలా వెసులుబాటు కల్పించిన భారతీయ రైల్వేలు... టికెట్ రద్దు కోసం గతంలో వసూలు చేస్తున్న చార్జీలను డబుల్ చేసేసింది. ఈ మేరకు నిన్న ఢిల్లీలో టికెట్ రద్దు కోసం ఫోన్ చేయాల్సిన ‘139’ నెంబరును ఆవిష్కరించిన రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు... రైల్వే రిజర్వేషన్ రద్దు చార్జీలను డబుల్ చేసేశారు. ఇకపై టికెట్ రద్దు కోరితే... గతంలో కోత పడే మొత్తం స్థానంలో డబుల్ కోత పడనుంది. వినియోగదారుడి జేబు గుల్ల కానుంది.