: నాకు చాలా నచ్చిన తెలుగు నటుడు బ్రహ్మానందం: కమలహాసన్
‘నాకు చాలా నచ్చిన తెలుగు నటుడు బ్రహ్మానందం గారు కూడా 'శభాష్ నాయుడు' చిత్రంలో నటిస్తున్నారు’ అని ప్రముఖ నటుడు కమలహాసన్ అన్నారు. హాస్య కథాంశంతో తెరకెక్కనున్న ‘శభాష్ నాయుడు’ చిత్రం విశేషాల గురించి ఒక టీవీ ఛానెల్ తో కమల్ మాట్లాడుతూ, ఈ చిత్రానికి ప్రముఖ రచయిత వెన్నెలకంటి కుమారుడు శశాంక్ తెలుగు మాటలు రాస్తుండగా, మలయాళం ఫిలిం ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ డైరెక్టర్ రాజీవ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారన్నారు. ఈ డైరెక్టర్ చాలా టాలెంటెడ్ అని, అందుకే ఈ చిత్రానికి దర్శకత్వం వహించమని కోరానని చెప్పారు. శ్రుతిహాసన్, నేను ఫస్ట్ టైమ్ కలిసి చేస్తున్న చిత్రమిది. రమ్యకృష్ణ గారు కూడా ఇందులో నటిస్తున్నారు’ అని చెప్పారు. కాగా, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంగీతం ఇళయరాజా అందించనున్నారు.