: దిగొచ్చిన కేంద్రం.. పీఎఫ్ పై వడ్డీ రేటు పెంపు


పీఎఫ్ పై ఇచ్చే వడ్డీ రేటు విషయంలో కేంద్రం దిగొచ్చింది. పీఎప్ పై వడ్డీ ని 8.8 శాతానికి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. కాగా, పీఎఫ్ పై ఇచ్చే వడ్డీ రేటును ఇటీవల 8.7 శాతానికి తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ఆర్థికశాఖ సమర్థించుకున్న విషయం తెలిసిందే. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) నిధులపై వచ్చే ఆదాయం తక్కువగా ఉన్నందున అంతకు మించిన వడ్డీ రేటు ఇవ్వలేమని ఆర్థికశాఖ చెప్పడం, దీనిపై దేశ వ్యాప్తంగా నిరసనలు తలెత్తడంతో కేంద్ర ఆర్థిక శాఖ దిగొచ్చింది.

  • Loading...

More Telugu News