: తెలంగాణ సాధన కోసం ఆ రోజున కేసీఆర్, విజయశాంతి సభను జరగనివ్వలేదు: శివాజీ


‘తెలంగాణ సాధన కోసం ఆ రోజున కేవలం ఇద్దరే ఇద్దరు కేసీఆర్, విజయశాంతి లోక్ సభను సాగనివ్వకుండా అడ్డుపడ్డారు.. తెలంగాణ సాధించుకున్నారు. కానీ, ఏపీకి ప్రత్యేక హోదాపై మన రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు నోరుమెదపట్లేదు’ అని నాటి విషయాలను హీరో శివాజీ ప్రస్తావించారు. ఏపీకి ప్రత్యేకహోదా విషయమై వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి, రాష్ట్రానికి చెందిన మిగిలిన బీజేపీ నేతలు, మంత్రులు అసలు ఏం చేస్తున్నారంటూ ఆయన ప్రశ్నించారు. ‘మనసువిప్పి పోరాటానికి సిద్ధంకండి, ప్రత్యేకహోదా ఎందుకు రాదో తేలుద్దాము. ఈ కాంగ్రెస్ నాయకులు... వీళ్లందరూ మహానాయకులు. ఆ రోజున బిల్లులో పెట్టేది ఓకే చేసుంటే పోయేది కదా! ప్రత్యేకహోదాపై నోటిమాట కన్నా బిల్లులో పెట్టేసి ఉంటే ఈ దరిద్రం ఉండేది కాదు కదా? ఏపీ ప్రత్యేక హోదాపై ఒక్క చంద్రబాబు నాయుడుగారు తప్పా, మిగిలిన మంత్రులెవ్వరూ మాట్లాడట్లేదు. చంద్రబాబు నాయుడుగారూ, బీజేపీతో తెగతెంపులు చేసుకోండి. ఏపీ నుంచి వెళ్లిన బీజేపీ నాయకులు వాళ్ల వ్యాపారాలు, లావాదేవీలు తప్పా ఏపీ ప్రజల గోడు పట్టించుకోవట్లేదు’ అని శివాజీ మండిపడ్డారు.

  • Loading...

More Telugu News