: ఇంకా నటన నేర్చుకుంటూనే ఉన్నాను: సినీ నటి జయప్రద


తాను ఇంకా నటన నేర్చుకుంటూనే ఉన్నానని ప్రముఖ సినీ నటి జయప్రద అన్నారు. హైదరాబాద్ లో ఒక షోరూం ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయప్రద మాట్లాడుతూ, త్వరలో బాలీవుడ్ చిత్రాల్లో మళ్లీ నటిస్తానని చెప్పారు. సినిమా, రాజకీయం మధ్య సమతుల్యత పాటిస్తానని, సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లో కూడా కొనసాగుతానని అన్నారు. ప్రస్తుతం తాను తమిళ సినిమాలోనూ నటిస్తున్నానని, త్వరలో మలయాళంలో ప్రారంభం కానున్న ఒక హారర్ చిత్రంలో నటిస్తున్నట్లు కూడా చెప్పారు. ఈ సందర్భంగా మహిళల రక్షణ, చెన్నైలో ‘అమ్మ‘ పథకం మొదలైన విషయాలను జయప్రద ప్రస్తావించారు.

  • Loading...

More Telugu News