: ఏపీలో పెరిగిన భానుడి ప్రతాపం.. సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీలు అధికం
ఆంధ్రప్రదేశ్‌లో భానుడి ప్రతాపం మరింత పెరిగింది. మధ్యాహ్నం వేళ ఇళ్లనుంచి బయటకు రావాలంటే ప్రజలు జంకుతున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగింది. పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడినప్పటికీ ఉష్ణోగ్రత మాత్రం పెరుగుతూనే వుంది. ఈరోజు అనంతపురం జిల్లాలో అత్యధికంగా 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు విశాఖలోని వాతావరణ కేంద్రం పేర్కొంది. అధిక ఉష్ణోగ్రత పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.