: ఆసియా ఛాంపియన్ షిప్‌లో సెమీస్‌కు దూసుకెళ్లిన సైనా
ఆసియా ఛాంపియన్ షిప్‌లో భాగంగా ఈరోజు జరిగిన బ్యాడ్మింటన్ క్వార్టర్ ఫైనల్‌లో చైనాకు చెందిన షిజియాన్ వాంగ్‌పై భారత సంచలనం సైనా నెహ్వాల్ గెలుపొందింది. తన ప్రత్యర్థిపై 21-16, 21-19 వరుస సెట్లతో గెలుపొంది సెమీస్‌లోకి ప్రవేశించింది. ఇటీవల నిర్వహించిన పలు బ్యాడ్మింటన్ సిరీస్‌లలో ఓటమిని చవిచూసిన సైనా ఈసారి విజయాన్ని దక్కించుకోవాలనే కసితో ఉంది.