: నీట్ పరీక్షలో మార్పుల్లేవ్: స్పష్టం చేసిన సుప్రీం
మెడికల్ కాలేజీల్లో ప్రవేశానికి దేశ వ్యాప్తంగా ఒకే కామన్ ఎంట్రన్స్ నిర్వహించాలంటూ నిన్న సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను పునఃసమీక్షించాలంటూ కేంద్రం వేసిన పిటిషన్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. నిన్న ప్రకటించిన షెడ్యూల్ మేరకే నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)ను నిర్వహించాలని సుప్రీం తెలిపింది. నిన్న చేసిన ఉత్తర్వుల్లో సవరణలు కోరుకుంటే దరఖాస్తులను అందజేయాలని సూచించింది. సవరణలు కోరితే వాటిపై విచారణ చేపడతామని తెలిపింది. నిన్న ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే నీట్‌ను మే1, జులై 24న నీట్ పరీక్షను నిర్వహించాలని ఆదేశించింది. ఆదేశాలు జారీ చేశాక పాటించాల్సిందేనని సుప్రీం వ్యాఖ్యానించింది.