: చిరు 150వ సినిమాకు అల్లు అరవింద్ కెమెరా స్విచాన్... పరుచూరి క్లాప్.. మొదటి సీన్ డైరెక్ట్ చేసిన నాగబాబు
మెగా అభిమానులు కొన్ని సంవత్సరాలుగా ఎదురుచూస్తోన్న చిరంజీవి 150వ సినిమాకి క్లాప్ పడింది. కొద్ది సేపటి క్రితం జరిగిన ఈ కార్యక్రమంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బృందం ఉత్సాహంగా పాల్గొంది. ‘కత్తిలాంటోడు’గా మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు రీ ఎంట్రీ ఇవ్వబోతున్న ఈ సినిమా షూటింగ్ కు ప్రముఖ సినీ రచయిత పరుచూరి వెంకటేశ్వరావు క్లాప్ కొట్టారు. అల్లు అరవింద్ కెమెరా ఆన్ చేశారు. ‘కత్తిలాంటోడు’ ముహూర్తపు సన్నివేశాన్ని చిరంజీవి తమ్ముడు నాగబాబు డైరెక్ట్ చేశాడు. తమిళ బ్లాక్ బస్టర్ 'కత్తి' రిమేక్తో చిరు రీ ఎంట్రీ ఇస్తోన్న సంగతి విదితమే.