: ఆర్థికంగా నిలదొక్కుకునే వరకు ఏపీకి ఏటా పదివేల కోట్లు ఇవ్వాలి: ఎంపీ కేవీపీ


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని, ఆర్థికంగా నిలదొక్కుకునే వరకు ఏపీకి ఏటా రూ.10 వేల కోట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేవీపీ కోరారు. కేవీపీ ఈరోజు రాజ్యసభలో ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టారు. విభజన చట్టంలోని అంశాలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. దాదాపు 20 కీలక అంశాలను చట్టంలో పొందుపరచాలని కోరారు. ఏపీకీ బుందేల్ ఖండ్ తరహా ఆర్థికసాయం ప్రకటించాలని, బుందేల్ ఖండ్, కొరాపుట్, బొలంగీర్, కలహండి తరహాలో రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని, పోలవరం ప్రాజెక్టు నిర్దేశిత సమయంలో పూర్తయ్యేలా నిధులు ఇవ్వాలని, ప్రత్యేక హైకోర్టు ఏర్పాటును త్వరితగతిన పూర్తి చేయాలనే పలు కీలక అంశాలు చట్టంలో పొందుపరచాలని కేవీపీ కోరారు.

  • Loading...

More Telugu News