: చైనా హాంకియావో ఎయిర్‌పోర్ట్‌లో అగ్నిప్రమాదం... ఇద్దరు ప్రయాణికుల మృతి
చైనాలోని షాంఘై, హాంకియావో విమానాశ్రయంలో అగ్నిప్రమాదం జరిగింది. విమానాశ్రయంలోని ఓ టెర్మినల్ వద్ద ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో విమానాశ్రయంలో ఉన్న ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. అగ్ని ప్రమాదంతో అక్కడి ప్రయాణికులు, సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రమాద ఘటనపై ఎయిర్‌పోర్ట్ అధికారులు విచారం వ్యక్తం చేశారు. అక్కడ జరుగుతోన్న పనుల కారణంగా ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెందాయని తెలిపారు.