: ‘మెగా’ ముహూర్తానికి వేళాయె... ఈరోజు మధ్యాహ్నం 1.30 నిమిషాలకు చిరంజీవి 150వ చిత్రం ప్రారంభం
అద్భుత నటనతో, డ్యాన్స్‌తో దాదాపు మూడున్నర దశాబ్దాలకు పైగా టాలీవుడ్ హీరోగా వెలుగొందిన మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ సినిమాకి రంగం సిద్ధమైంది. దీంతో మెగా అభిమానుల ఆనందం ఆకాశాన్నంటుతోంది. ఈరోజు మధ్యాహ్నం 1.30 నిమిషాలకు మెగాస్టార్ 150వ సినిమా ప్రారంభం కానుంది. వీవీ వినాయక్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసిందే. రామ్‌చరణ్ ప్రారంభించిన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ లోగో ను సైతం ఇప్పటికే విడుదల చేసేశారు. తమిళ బ్లాక్ బస్టర్ 'కత్తి' రిమేక్‌తో చిరు రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. వీవీ వినాయక్ చిరంజీవిని 'కత్తిలాంటోడు'గా చూపించనున్నారు. చిరుని మళ్లీ తెరపై హీరోగా చూడడానికి ఎంతో కాలంగా వేచి ఉన్న అభిమానులు.. మెగాస్టార్ రీ ఎంట్రీపై ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు.