: ‘నీట్’పై మధ్యంతర ఉత్తర్వులని పునఃసమీక్షించాలి: కేంద్రం తరఫున సుప్రీంను కోరిన అటార్నీ జనరల్
నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) ద్వారానే మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించాలంటూ నిన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం విధితమే. అయితే, సుప్రీం ఆదేశాలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో అయోమయం నెలకొంది. మరోవైపు నీట్ పై కేంద్రం మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేంద్రం తరఫున అటార్నీ జనరల్, న్యాయవాదులు ఈరోజు తమ వాదనలు వినిపించారు. నీట్ మధ్యంతర ఉత్తర్వులని పునఃసమీక్షించాలని సుప్రీంను అటార్నీ జనరల్ కోరారు. నిన్నటి ఉత్తర్వుల్ని సవరించాలని సుప్రీంను కోరారు. కేరళలో మెడికల్ ప్రవేశపరీక్ష ఇప్పటికే పూర్తయిందని విద్యార్థులు అయోమయంలో పడతారని సుప్రీంకు అటార్నీ జనరల్, న్యాయవాదులు విన్నవించారు. అంతేకాక, ఇప్పటికిప్పుడు పరీక్షను హిందీ, ఇంగ్లీష్ లలో రాయడం కష్టమని తెలిపారు.