: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు
స్టాక్‌మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ ఏకంగా 461 పాయింట్లు నష్టపోయి 25,603 పాయింట్ల వద్ద ముగిస్తే, నిఫ్టీ 133 పాయింట్లు కోల్పోయి 7,847 పాయింట్ల వద్ద ముగిసింది. నిన్న ఈ ఏడాది గరిష్ఠానికి చేరిన నిఫ్టీ ఈరోజు ఒక్కసారిగా 133 పాయింట్లు కోల్పోయి మళ్లీ నష్టాలనే చవిచూసింది. కాగా, డాలరుతో రూపాయి మారకం విలువ 66.49 రూపాయలుగా ఉంది.