: పీఎస్ఎల్వీ సీ-33 ప్రయోగం సక్సెస్.. సొంత నావిగేషన్ వ్యవస్థ ఉన్న దేశాల సరసన భారత్
సొంత నావిగేషన్ వ్యవస్థ ఉన్న దేశాల సరసన భారత్ చేరింది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగవేదిక నుంచి నిప్పులు చిమ్ముతూ నింగికి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ-33 ఉపగ్రహ వాహకనౌక ప్రయోగం విజయవంతమైంది. దీంతో సొంత నావిగేషన్ వ్యవస్థ ఉన్న ఆరో దేశంగా భారత్ నిలిచింది. ఆరు ఉపగ్రహాలతో 12 ఏళ్ల పాటు పని చేస్తూ ఎప్పటికప్పుడు కీలక సమాచారాన్ని మనకు అందించనుంది. దిక్సూచి వ్యవస్థను మరింత మెరుగు పర్చనుంది. ప్రయోగం విజయవంతం కావడం పట్ల, షార్ శాస్త్రవేత్తలు, ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు.