: కేబినెట్ లో చేరడం లేదు!... 2019 నాటికి రెడీ అవుతున్నా!: నారా లోకేశ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కోసం ఏ ఒక్క ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడప్పుడే ఆయన కేబినెట్ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడం లేదట. 2019లో జరిగే ఎన్నికల నాటికి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగడంతో పాటు కేబినెట్ లో మంత్రి పదవి చేపట్టేందుకు రెడీ అవుతారట. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం విజయవాడలో నిర్వహించిన ‘మీడియాతో చిట్ చాట్’లో భాగంగా స్వయంగా నారా లోకేశ్ ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. ఇప్పుటికిప్పుడు కేబినెట్ లో చేరడం లేదని ప్రకటించిన ఆయన తన కేబినెట్ రంగ ప్రవేశంపై జరుగుతున్న ఊహాగానాలకు తెరదించారు. 2019లో జరిగే ఎన్నికల బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నానని, ఆ తర్వాత కేబినెట్ లో చేరేందుకు సిద్ధమవుతానని కూడా లోకేశ్ ప్రకటించారు.