: నిప్పులు చిమ్ముతూ నింగికి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ సీ-33


శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగవేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ-33 ఉపగ్రహ వాహకనౌక నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ ఆధ్వ‌ర్యంలో ఈ ప్ర‌యోగం కొన‌సాగుతోంది. పీఎస్‌ఎల్‌వీ సీ-33 రాకెట్ ద్వారా అంత‌రిక్షానికి పంపుతోన్న.. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ సిరీస్‌లో ఆఖరిది, ఏడవదైన 1,425 కిలోలు గ‌ల ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జీ ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైతే స్వదేశీ నేవిగేషన్ సిస్టమ్ అందుబాటులోకి రానుంది. ప్ర‌యోగం విజ‌య‌వంతం కావాల‌ని షార్ శాస్త్ర‌వేత్త‌లు ఎంతో ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్నారు.

  • Loading...

More Telugu News