: వైసీపీ చెరువుకి గండి ప‌డింది, జ‌గ‌న్ అనే ఒక్క చుక్కే మిగులుతుంది: జేసీ దివాక‌ర్ రెడ్డి


వైసీపీ చెరువుకి గండి ప‌డిందని, ఆ చెరువులో ఒక్క చుక్క‌నీరయినా ఇక మిగ‌లద‌ని తెలుగు దేశం పార్టీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి అమ‌రావ‌తి సమీపంలోని తాడేప‌ల్లిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు స‌మ‌క్షంలో టీడీపీలో చేరారు. ఈ సంద‌ర్భంగా కార్య‌క్ర‌మానికి హాజ‌రైన జేసీ దివాక‌ర్ రెడ్డి మాట్లాడుతూ.. వైసీపీలో చెరువులో ఒక్క చుక్క నీరు కూడా క‌నిపించ‌ద‌ని, ఒక‌వేళ క‌నిపిస్తే ఆ ఒక్క చుక్క జ‌గ‌నే అని వ్యాఖ్యానించారు. వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఒక్క‌డే ఆ పార్టీలో మిగులుతాడ‌ని జేసీ దివాక‌ర్ రెడ్డి జోస్యం చెప్పారు. టీడీపీలోకి వైసీపీ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా త‌మ వ్య‌క్తిగ‌త స్వార్థంతో రాలేద‌ని, వారి నియోజ‌క వ‌ర్గాల అభివృద్ధి కోస‌మే త‌మ పార్టీలో చేరుతున్నార‌ని అన్నారు. ముఖ్యమ‌ంత్రి చంద్ర‌బాబు అనంత‌పురాన్ని కోనసీమ‌లా మారుస్తున్నారని జేసీ కితాబు ఇచ్చారు. ‘చంద్ర‌బాబు లాంటి సీఎం దేశంలో మ‌రొక‌రు లేరు.. రారు..’ అని వ్యాఖ్యానించారు

  • Loading...

More Telugu News