: ఐసీసీ చైర్మన్ పదవికే శశాంక్ మొగ్గు!... బీసీసీఐ చీఫ్ ఎవరో?
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు చీఫ్ శశాంక్ మనోహర్... ఆ పదవిని వదులుకోవడానికే దాదాపుగా సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఐసీసీ చైర్మన్ గానూ వ్యవహరిస్తున్న శశాంక్...ఇకపై జోడు పదవుల్లో కొనసాగడం కుదరదు. ఈ మేరకు ఐసీసీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కొత్త మార్గదర్శకాలను అమల్లోకి తెచ్చింది. ఏదేనీ దేశ బోర్డుకు నేతృత్వం వహిస్తున్న వ్యక్తి... అదే సమయంలో ఐసీసీ చైర్మన్ పదవిలో కొనసాగడం కుదరదని ఆ మార్గదర్శకాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఐసీసీ చైర్మన్ పదవిలో కొనసాగాలంటే... బీసీసీఐ చీఫ్ పదవిని శశాంక్ వదులుకోవాల్సిందే. ఒకవేళ బీసీసీఐ చీఫ్ పదవిలోనే కొనసాగాలంటే ఆయన ఐసీసీ చైర్మన్ పదవిని వదులుకోక తప్పదు. ఈ క్రమంలో బీసీసీఐ చీఫ్ పదవికే రాజీనామా చేయాలని శశాంక్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. మరి శశాంక్ ఖాళీ చేసేిన బీసీసీఐ చీఫ్ పదవిలో ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారన్న విషయంపై ఆసక్తికర చర్చకు తెర లేచింది. ఎన్సీపీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి... గతంలో బీసీసీఐ చీఫ్ గా వ్యవహరించిన శరద్ పవార్ మరోమారు బీసీసీఐ పగ్గాలు చేపడతారన్న ప్రచారం సాగుతోంది.