: భానుడి ప్ర‌తాపానికి నాలుగేళ్లలో నాలుగు వేల మంది మృతి.. తెలుగువారే అధికం


భానుడి ప్ర‌తాపంతో జ‌నం పిట్ట‌ల్లా రాలిపోతున్నారు. సాధారణంగా వేస‌విలో మేలో క‌నిపించే ఉష్ణోగ్ర‌త‌లు ఈసారి ఏప్రిల్ లోనే క‌నిపిస్తున్నాయి. ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు త‌మ రాష్ట్రాల్లో ఏప్రిల్‌లోనే ఎండ‌తీవ్ర‌త‌కు వంద‌ల సంఖ్య‌లో ప్రాణాలు కోల్పోయిన‌ట్లు ప్ర‌క‌టిస్తున్నాయి. తాజాగా లోక్‌స‌భ‌లో శాస్త్ర సాంకేతిక భూ విజ్ఞాన శాఖ సహాయ మంత్రి వై.సుజనా చౌదరి దేశ‌వ్యాప్తంగా భానుడి ప్ర‌తాపానికి మృత్యువాత ప‌డ్డ వారి సంఖ్య‌ను పేర్కొన్నారు. ఈ వివ‌రాల ప్ర‌కారం 2013నుంచి ఈ ఏడాది మార్చివ‌ర‌కు 4,204 మంది ప్ర‌జ‌లు ఎండల తీవ్రతకు బ‌లైపోయారు. 2013, 14, 15 సంవ‌త్స‌రాల్లో వ‌ర‌స‌గా 1,433, 549, 2,135 మంది మృత్యువాత ప‌డ్డారు. దీనిలో ఏపీ, తెలంగాణ వాసులే అధికంగా ఉన్నారు. ఈ ఏడాదిలో మార్చి వ‌ర‌కు 87మంది ఎండ‌ల‌కు బ‌లైపోయారు. రానున్న మే నెల‌లో ఎండ‌ల తీవ్రత మ‌రింత పెర‌గొచ్చ‌ని హెచ్చ‌రిస్తూ... ప్ర‌జ‌లు పూర్తి జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని వాతావ‌ర‌ణ శాస్త్ర‌వేత్త‌లు సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News