: జంపింగ్ ల జోరు కంటిన్యూస్!...నేడు టీడీపీలోకి బుడ్డా, కిడారి!


ఏపీలో అధికార పార్టీ టీడీపీలోకి వలసల జోరు కొనసాగుతోంది. వైసీపీ టికెట్లపై ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన వారిలో ఇప్పటికే 14 మంది టీడీపీలో చేరిపోయారు. తాజాగా నేడు మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిన్న రాత్రే తన అనుచరులతో కలిసి విజయవాడ బయలుదేరారు. మరోవైపు విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కూడా తన అనుచరులతో కలిసి నిన్న రాత్రే విజయవాడ బాట పట్టారు. వీరిద్దరూ నేడు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. వీరిద్దరి చేరికతో... వైసీపీ నుంచి జంప్ కొట్టిన ఎమ్మెల్యేల సంఖ్య 16కు చేరనుంది. ఇక వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య సరిగ్గా హాఫ్ సెంచరీకి పడిపోనుంది.

  • Loading...

More Telugu News