: ముఖానికి రంగేసుకున్న లాలూ పుత్రుడు!... భోజ్ పురి చిత్రంలో సీఎం పాత్రలో కనిపించనున్న వైనం


రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ పుత్రరత్నం, ప్రస్తుతం బీహార్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న తేజ్ ప్రతాప్ యాదవ్... సీఎం కావాలన్న తన కోరికను తీర్చేసుకున్నారు. అయితే, అది రియల్ లైఫ్ లో కాదు... ‘రీల్ లైఫ్’లో.. అదేనండి... సినిమాల్లో! బీహార్ లో లాలూ, ఆయన సతీమణి రబ్రీదేవిలు సీఎంలుగా కొనసాగిన కాలంలో ఆ రాష్ట్రంలో జరిగిన వరుస కిడ్నాప్ లను ఆధారం చేసుకుని భోజ్ పురిలో ‘అపహరన్ ఉద్యోగ్’ పేరిట ఓ చిత్రం తెరకెక్కుతోంది. సదరు చిత్రంలో తేజ్ ప్రతాప్ సీఎం పోస్టులో కనిపించనున్నారు. పాత్ర నిడివి చిన్నదిగానే ఉన్నా, చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. ఇటీవలే పాట్నా సమీపంలోని రాజ్ గిర్ ప్రాంతంలో ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ జరిగిందట. ఈ షూటింగ్ లోనే తేజ్ ప్రతాప్ తన ముఖానికి రంగేసుకుని సీఎం పాత్రలో కనిపించి ముచ్చట తీర్చుకున్నారు.

  • Loading...

More Telugu News