: రాజమహేంద్రవరంలో అందాల తార రకుల్ ప్రీత్ సింగ్
అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ తూర్పుగోదావరి జిల్లాలో సందడి చేసింది. రాజమహేంద్రవరంలో ఒక బంగారు ఆభరణాల దుకాణం ప్రారంభోత్సవం నిమిత్తం ఆమె ఇక్కడికి వచ్చింది. ఈ సందర్భంగా దుకాణంలోని నగలను ప్రదర్శిస్తూ ఫొటోలకు పోజులిచ్చింది. ‘రకుల్’ ను చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆకుల సత్యనారాయణ, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.