: డిసెంబర్ నాటికి 6,200 గ్రామాలకు మంచి నీళ్లు రాబోతున్నాయి: తెలంగాణ సీఎం


ఈ డిసెంబర్ నాటికి తెలంగాణలోని 6,200 గ్రామాలకు మంచినీళ్లు రాబోతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇంటింటికీ నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగబోమని చెప్పిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని నాడు చెప్పిన మాటలను కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. అలాగే 2017 డిసెంబర్ నాటికి రాష్ట్రంలోని 95 శాతం ఇళ్లకు మంచి నీళ్లు అందుతాయన్నారు. తెలంగాణ ప్రజల దీవెనలు ఉన్నంత వరకు మొక్కవోని దీక్షతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని, అద్దాల లాంటి రోడ్లు వచ్చే వరకు, బడుగు, బలహీన వర్గాల పిల్లలు కేజీ టూ పీజీ చదువుకునే వరకు కేసీఆర్ నిద్రపోడు, విశ్రమించడని ప్రజలకు విఙ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.

  • Loading...

More Telugu News