: భ‌గ‌త్ సింగ్‌ను ఉగ్ర‌వాదిగా పేర్కొంటూ ముద్రితమైన పాఠ్య‌గ్రంథం.. తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు


దేశభక్తిని నరనరాన జీర్ణింపజేసుకొని, తెల్లవారి ముందు అంతులేని ధైర్యాన్ని ప్రదర్శించి, ఉరితాడుతో ఉయ్యాలలూగిన భారత తేజం భగత్‌సింగ్ ను ఢిల్లీ యూనివర్శిటీ ప్రచురించిన ఒక పాఠ్యగ్రంథంలో ఉగ్ర‌వాదిగా పేర్కొన్నారు. దీనిపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లొస్తున్నాయి. దానిలో భ‌గ‌త్ సింగ్‌ను 'విప్లవ ఉగ్రవాది' అని పేర్కొన్నారు. దీనిపై భగత్‌సింగ్‌ మేనల్లుడు అభయ్‌ సింగ్ సాంధు స్పందిస్తూ.. ఈ అంశం ఎంతో దురదృష్టకరమని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దేశంకోసం ప్రాణాలర్పించిన వారిని స్వాతంత్య్రం లభించిన 68 సంవత్సరాల తరువాత కూడా ఈ విధంగా పేర్కొనడం విచారించ‌ద‌గిన విష‌యం అని అన్నారు. భ‌గ‌త్ సింగ్‌ను ఉరితీసిన తెల్ల‌దొర‌లు కూడా తమ తీర్పులో భగత్‌సింగ్‌ను 'నిజమైన విప్లవకారుడు' అని సంబోధించారని గుర్తు చేశారు. ఆంగ్లేయులు సైతం ఆయ‌న‌ను ఉగ్రవాదిగా పేర్కొనలేదని అన్నారు. దీనిపై దేశ‌వ్యాప్తంగా భ‌గ‌త్ సింగ్ అభిమానులు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఆ పుస్త‌కంలో రెవెల్యూష‌న‌రీ టెర్ర‌రిస్ట్ (విప్ల‌వ ఉగ్ర‌వాది)తో పాటు టెర్రిరిస్ట్ యాక్ట్‌, యాక్ట్ ఆఫ్ టెర్ర‌రిజం అనే ప‌దాలు ఉండ‌డం శోచ‌నీయం.

  • Loading...

More Telugu News