: ఉత్త‌రాఖండ్‌లో రాష్ట్రప‌తి పాల‌న కొన‌సాగింపు, 29న బ‌ల నిరూప‌ణ లేదు: సుప్రీం


ఉత్త‌రాఖండ్‌లో రాష్ట్రప‌తి పాల‌న కొన‌సాగించాల‌ని దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం ఆదేశించింది. ఉత్త‌రాఖండ్ హైకోర్టు నిర్ణ‌యాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. శాస‌న‌స‌భ‌లో ఈనెల‌ 29న బ‌ల నిరూప‌ణ లేద‌ని సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది. ఉత్త‌రాఖండ్ హైకోర్టు నిర్ణ‌యాన్ని స‌వాలు చేస్తూ కేంద్రం వేసిన పిటిష‌న్‌పై ఈరోజు వాద‌న‌ల‌ను విన్న సుప్రీం రాష్ట్రప‌తి పాల‌న కొన‌సాగించాల‌ని స్ప‌ష్టం చేసింది. అంత‌కుముందు ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన విధింపు అంశంపై కేంద్రంపై ప‌లు ప్ర‌శ్న‌లు సంధించింది. ఈ కేసుతో ఉత్తరాఖండ్ సీఎస్ కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయడం కూడా రాష్ట్రపతి పాలన విధించడానికి ఒక కారణం అయ్యిందా..? అంటూ సుప్రీం కేంద్రాన్ని ప్రశ్నించింది.

  • Loading...

More Telugu News