: ప్లీనరీ వేదికపై అదరగొట్టిన తెలంగాణ సూపర్ కిడ్ లక్ష్మీ శ్రీజ
ఖమ్మంలో జరుగుతున్న టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీలో తెలంగాణ సూపర్ కిడ్ లక్ష్మీ శ్రీజ గుక్క తిప్పుకోకుండా మాట్లాడింది. వేదికపై ఉన్న వారందరికీ నమస్కారాలని..తన పేరు లక్ష్మీ శ్రీజ అంటూ తన ఉపన్యాసాన్ని ప్రారంభించిన ఈ బాల మేధావి, పలు అంశాలపై గుక్కతిప్పుకోకుండా మాట్లాడింది. టీఆర్ఎస్ పార్టీ పెట్టడానికి గల కారణాలు, గతంలో కేసీఆర్ నిర్వహించిన పదవులు, గతంలో చంద్రబాబు రూపొందించిన విజన్ 2020లో తెలంగాణ గురించి లేకపోవడంపై కేసీఆర్ చేసిన బహిరంగ విమర్శలు, చంద్రబాబు కరెంటు చార్జీలు పెంచినప్పుడు కేసీఆర్ చేసిన విమర్శలు, వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం, కొన్ని రోజుల తర్వాత ఆయన ప్రమాదంలో చనిపోవడం, సీఎంగా రోశయ్య ప్రమాణ స్వీకారం, ఫ్రీజోన్ ఉద్యమం ప్రత్యేక ఉద్యమంగా మారడం, కేసీఆర్ క్యాబినెట్...ఇలా పలు అంశాల గురించి క్లుప్తంగా ఎటువంటి తప్పులు లేకుండా, స్పష్టంగా వేదికపై నుంచి శ్రీజ మాట్లాడింది. దీంతో కేసీఆర్ సహా టీఆర్ఎస్ నేతలందరూ చప్పట్లు కొట్టిమరీ చిన్నారిని అభినందించారు.