: రాష్ట్ర స్థాయిలో 79... చిత్తూరు జిల్లాలో 5: ఎమ్మెల్యేల ర్యాంకుల్లో వెనుకబడ్డ చంద్రబాబు


ఇటీవల విజయవాడలో జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో భాగంగా తన కేబినెట్ లోని మంత్రులకు ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ర్యాంకులిచ్చారు. శాఖాపరంగా పనితీరు, ఆయా జిల్లాల ఇన్ చార్జీల మంత్రులుగా పనిచేస్తున్న తీరుకు సంబంధించి... మంత్రులకు రెండు కేటగిరీల్లో ర్యాంకులిచ్చారు. ఈ విషయంపై నాడు పెద్ద చర్చే నడిచింది. ఇక ఎమ్మెల్యేల పనితీరును బట్టి రాష్ట్ర స్థాయి, జిల్లాల వారీగా కూడా చంద్రబాబు ర్యాంకులిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ర్యాంకుల్లో చిత్తూరు జిల్లా కుప్పం ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు అంతగా రాణించలేకపోయారు. ఈ మేరకు తనకు తానే ఇచ్చుకున్న ర్యాంకుల్లో చంద్రబాబు... పనితీరులో తాను వెనుకబడ్డానని చెప్పకనే చెప్పారు. ఇక ర్యాంకుల విషయానికొస్తే... రాష్ట్రస్థాయి ర్యాంకుల్లో 79వ స్థానంలో నిలిచిన చంద్రబాబు... తన సొంత జిల్లా ర్యాంకుల్లో మాత్రం ఐదో ర్యాంకులో ఉన్నారు. ర్యాంకు పరంగా ఐదో స్థానంలో నిలిచినా 64 శాతం మార్కులతో చంద్రబాబు ఫస్ట్ గ్రేడ్ లోనే నిలిచారు. ఇక చిత్తూరు జిల్లా ర్యాంకుల విషయానికొస్తే... కొత్తగా సభలో అడుగుపెట్టిన తంబళ్లపల్లి ఎమ్మెల్యే శంకర్ అందరినీ వెనక్కు నెట్టేసి ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు. ఇక సీనియర్ ఎమ్మెల్యేగానే కాకుండా మంత్రిగానూ కొనసాగుతున్న బొజ్జల గోపాలకృష్ణారెడ్డి(శ్రీకాళహస్తి) రెండో స్థానంలో నిలించారు.

  • Loading...

More Telugu News