: టీడీపీకి అధికారమేమీ కొత్త కాదు: విశాఖలో నారా లోకేశ్


టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కొద్దిసేపటి క్రితం సాగర నగరం విశాఖలో కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో పార్టీ స్థితిగతులను సమీక్షించేందుకు నేటి ఉదయం విశాఖ వచ్చిన లోకేశ్... జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ చార్జీలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత పార్టీ కొత్త కార్యాలయానికి ఆయన భూమిపూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీడీపీకి అధికారం కొత్తేమీ కాదని వ్యాఖ్యానించారు. తన తాత ఎన్టీఆర్ ప్రారంభించిన టీడీపీ... ఏడాదిలోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించిందన్నారు. ఆ తర్వాత కూడా పలుమార్లు అధికారంలోకి వచ్చిన పార్టీ రాష్ట్ర పురోభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేసిందన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దమ్ముంటే ఆస్తులు వెల్లడించాలని ఆయన సవాల్ విసిరారు. టీడీపీకి అధికారం కొత్తేమీ కాదని లోకేశ్ చేసిన ప్రకటన... అధికారం కోసం అర్రులు చాస్తోన్న జగన్ ను లక్ష్యంగా చేసిన వ్యాఖ్యేనని తెలుస్తోంది. త్వరలో గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పోరేషన్ (జీవీఎంసీ)కి జరగనున్న ఎన్నికల నేపథ్యంలోనే లోకేశ్ విశాఖ పర్యటనకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

  • Loading...

More Telugu News