: శ్రీసిటీలో చంద్రబాబు... ఇసుజు మోటార్స్ యూనిట్ ను ప్రారంభించిన ఏపీ సీఎం
నవ్యాంధ్రలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెడుతోంది. రెండు రోజుల క్రితం తన సొంత జిల్లా చిత్తూరుకు వెళ్లిన ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శ్రీసిటీలో క్యాడ్ బరీ చాక్లెట్ తయారీ యూనిట్ ను ప్రారంభించారు. ఆసియాలోనే అతిపెద్ద చాక్లెట్ తయారీ యూనిట్ గా రికార్డులకెక్కిన ఈ యూనిట్ ద్వారా 1,600 మందికి ఉపాధి లభించనుంది, ఇది జరిగిన రెండు రోజులు అయ్యిందో, లేదో... కొద్దిసేపటి క్రితం మరోమారు చంద్రబాబు శ్రీసిటీకి వెళ్లారు. అక్కడ నిర్మాణం పూర్తి చేసుకున్న ఇసుజు మోటార్స్ ప్లాంట్ ను ఆయన ప్రారంభించారు.